సమర్పణ: అంతర్ముఖ స్వేచ్ఛకు ఒక చైతన్యపూర్వక బ్లూప్రింట్

సమర్పణ అనే కళ: దేనికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు & ఎలా

మనుషులుగా మనం ఎదుర్కొనే అత్యంత పెద్ద సవాళ్లలో సమర్పణ ఒకటి. మన దృక్కోణం సరైనదే అని నమ్మి, చాలామంది పరిస్థితులకు లేదా వ్యక్తులకు వదిలేయడం లేదా తగ్గి ఉండడం వంటి అన్నిటినీ వ్యతిరేకిస్తారు. కానీ మన చైతన్యం అభివృద్ధి చెందేకొద్దీ ఈ మనస్తత్వం సహజంగానే మారుతుంది. మనం ఎదుగుతుంటే, అంగీకరించే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా పెరుగుతాయి.

నిజమైన సమర్పణ అంగీకారంతో ప్రారంభమవుతుంది. మనం “నాకే బాగా తెలుసుననే” భావాన్ని విడిచిపెట్టినప్పుడు, మన పరిమిత దృక్కోణం దాటి జీవితం ఎన్నో విషయాలను కలిగి ఉందని గుర్తించటం మొదలవుతుంది. ఈ అవగాహన మనలను కృపతో ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు సమర్పణ మన జీవితంలోని వివిధ కోణాల్లో ఎలా వ్యక్తమవుతుందో చూద్దాం.

దేనికి?

మీ హయ్యర్ సెల్ఫ్‌కి (Higher Self) సమర్పించుకోండి.
మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నట్లయితే, Higher Self లేదా Overself అనే భావనకు మీరు ఇప్పటికే పరిచితులై ఉండవచ్చు. ఎప్పుడైనా ఏదైనా పరిస్థితి భారమైందిగా లేదా గందరగోళంగా అనిపిస్తే, ఒక సరళమైన సోల్ ఇన్వొకేషన్ ద్వారా దానిని మీ Higher Self‌కి పని అప్పగించండి. ఈ ఉన్నతాత్మకు మీకు మార్గనిర్దేశం చేయడం తెలుసునని నమ్మండి.

మీరు భక్తి మార్గంలో ఉంటే, దేవుడు, దేవత లేదా మీ విశ్వాసానికి అనుగుణంగా ఉండే ఏ రూపానికైనా సమర్పించుకోండి. మీ భారాలు, సందేహాలు, సవాళ్లను సృష్టికర్తకు అర్పించండి. మళ్లీ ఇక్కడ కూడా నమ్మకం కీలకం.

ఎప్పుడు?

నిజాయితీగా ప్రయత్నించిన తర్వాత కూడా మీ పరిధికి మించినట్టుగా అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు సమర్పణ మొదలు అవ్వాలి. అలాంటి సమయంలో దానిని దివ్య సమయానికి (Divine Timing) అప్పగించండి. మీ శ్రేయస్సుకు అనుకూలమైన ఫలితాన్ని సరైన సమయంలో మీ జీవితంలో సహజంగా వికసించనివ్వండి. దీనికి కొంత సమయం పడుతుంది.

ఇంకా మెరుగైనది. మొదటి నుంచే సమర్పణ ధోరణిని పెంపొందించుకోవడం. దైవం మీలోనే ఉంది అని మీరు నమ్మినా, బయటి విశ్వ సృష్టికర్తగా ఉంది అని నమ్మినా, సమర్పణ స్థితిలో ఉండడం అనేవి కలకలం మీకు సహాయం, స్పష్టత, శాంతి మొదటి నుంచే తీసుకొస్తుంది. దీని వలన భరోసాగా ముందుకు సాగుతాము.

ఎక్కడ సమర్పించాలి?

ప్రైమ్ క్రియేటర్‌గా పిలువబడే ‘సోర్స్’‌కి అంటే మూలచైతన్యానికి.
ఈ సోర్స్ ఎక్కడ ఉంది? ప్రతిచోటా. “అహం బ్రహ్మాస్మి” నేనే దైవాన్ని.

మీరు మీ సవాళ్లను సోర్స్‌కి అప్పగించి, మీ చర్యలను కొనసాగిస్తే, మార్గదర్శనం ప్రవహించడం మొదలవుతుంది. ఈ ప్రపంచ ప్రయాణం మనకు ఎల్లప్పుడూ సులభంగా అనిపించకపోవచ్చు, కానీ ఉన్నత స్థాయి కల దివ్య చైతన్యానికి అది పూర్తిగా సహజ స్థితిలో ఉంటుంది ఎందుకంటే అది ప్రతి విషయాన్ని ప్రస్తుత క్షణంలోనే గ్రహిస్తుంది. సవాలు మరియు పరిష్కారం రెండూ ఇప్పుడే ఇక్కడే ఉన్నాయి. వాటిని మీకు స్పష్టంగా మూలచైతన్యం తెలియచేస్తుంది.

ఎందుకు?

సవాళ్లు ఎక్కువగా వస్తాయి ఎందుకంటే అవి మన ప్రస్తుత అర్థం చేసుకునే స్థాయిని మించినవి. చైతన్యం విస్తరించేకొద్దీ, ఒకప్పుడు భారంగా అనిపించినవి నిర్వహించదగినవిగా మారతాయి. కానీ చైతన్యం ఎదుగుదలకు సమయం పడుతుంది. ఈ లోపు పరిష్కారం కాని సవాళ్లు మనలను ఇబ్బంది పెట్టవచ్చు లేదా మరింత తీవ్రమవ్వచ్చు.

అందుకే సమర్పణ అనేది శక్తివంతమైంది. Higher Self లేదా సృష్టికర్తకు విస్తృతమైన చైతన్యం ఉంది. మనకు క్లిష్టంగా కనిపించే పరిస్థితులను పరిష్కరించే సామర్థ్యం ఉంది. మీరు ఇది నమ్మి, ఈ ఉర్డ్వాత్మ ని పని చేయనిస్తే, పరిష్కారాలు వేగంగా మరియు సౌమ్యంగా ప్రత్యక్షమవుతాయి.

ఎలా?

సంపూర్ణ హృదయంతో, సందేహం లేకుండా సమర్పించుకోండి.
విజయం సాధించడానికి ఈ ప్రక్రియ చాలా సులభం:

సక్సెస్ మంత్రం - అంగీకరించండి; నమ్మండి; సమర్పించండి

ఆందోళనలను విడిచిపెట్టండి, అంతర్గత ప్రతిఘటనను నిశ్శబ్దం చేయండి, మీ Higher Self లేదా సృష్టికర్త సామర్థ్యాన్ని విశ్వసించండి. మీ ప్రస్తుత స్వరూపం కంటే గొప్పదైన శక్తి మీకు దారి చూపడానికి సిద్ధంగా ఉంది.

మీరు పూర్తి సమర్పణ సమయంలో, మీరు “సురక్షిత విజయం” వైపు నడిపించే రక్షిత మార్గంలో అడుగుపెడతారు.

మార్పు ప్రక్రియలో ప్రశాంతంగా ఉండండి. గూడులో నుంచి బయటికి వస్తున్న సీతాకోకచిలుకలా, మీరు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మీ పరిష్కారాల దిశగా ఎగరడానికి సిద్ధమవుతారు.

మీ హయ్యర్ సెల్ఫ్‌కి సమర్పణ – ఇది దీర్ఘకాల ఆనందానికి మంత్రం.

విజయం కాంతిదే.

మాతో చేరడానికి: లైట్ వర్క్ ఇండియా WhatsApp చానల్: 🔗https://whatsapp.com/channel/0029Va63NlAGehEThlJaAc44
గాడెస్ పవర్ WhatsApp గ్రూప్: https://chat.whatsapp.com/DZKwfjvLQXeAlgtX6EPfRR

తెలుగు; ఇంగ్లిష్ & హింది భాషలలొ వెబ్సైట్: 🔗https://regret2revamp.com/

Jagruthi ఇంగ్లీష్ & హింది YouTube Channel 🔗https://youtube.com/@jagruthi
Crack the belief తెలుగు YouTube Channel 🔗 https://www.youtube.com/@CrackTheBelief

Blog: 🔗 http://crackthebelief.blogspot.com/?m=1

Contact mail id: http://regret2revamp@gmail.com

టాకియాన్ చాంబర్ అపాయింట్మెంట్ కోసం ఈ ప్లే లిస్ట్ లో ఉన్న వీడియో లు చూడండి:
📽️https://www.youtube.com/playlist?list=PLsvD0UerbYdpT4GsnbRPGAOmUtZFo7BEo
టాకియాన్ హీలింగ్ సెషన్ అపాయింట్మెంట్ కోసం 📧http://regret2revamp@gmail.com కి మెయిల్ రాయండి.
లేదా 💬74113 33335 whatsapp కి మెసేజ్ చేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి