నిశ్శబ్దం నుండి శక్తివరకు: మిమ్మల్ని ఆపేసే చక్రాలను పూర్తి చేయండి

మన జీవితం యొక్క వివిధ దశల్లో నిశ్శబ్దం అనేక పాత్రలు పోషిస్తుంది. కానీ నిశ్శబ్దంగా ఉండటం మనకు నిజంగా ఎంతవరకు సహాయం చేస్తుంది? అది హానికరంగా కూడా మారుతుందా?

మనకు తరచూ ఒక నానుడి వింటాం “స్పీచ్ is సిల్వర్, సైలెన్స్ is గోల్డ్.” ఈ భావనతో చాలా మంది జీవితంలో ఘర్షణలను తప్పించుకోవడానికి నిశ్శబ్దాన్ని ఎంచుకుంటారు. ఉదాహరణకు:

  • కుటుంబంలో పెద్ద పిల్లవాడిగా, చిన్నవారి కోసం మీరు త్యాగం చేయాలని మీ తల్లితండ్రులు; సంఘం మీకు చెప్పే ఉంటారు.
  • పాఠశాలలో భయం లేదా సంకోచం కారణంగా మీరు అనేక సందర్భాల్లో నిశ్శబ్దంగా మిమ్మల్ని మీరు ప్రకటించుకోకుండా ఉండిపోయి ఉండవచ్చు.
  • ఉద్యోగస్థలంలో, ఉన్నతాధికారులు లేదా సహోద్యోగుల అహంకారాన్ని తృప్తిపరచడానికి నిశ్శబ్దం అక్కడ ఆశిస్తారు.
  • సమాజంలో నిశ్శబ్దాన్ని జీవతాన్ని ముందుకు తీసుకెళ్లే ఆయుధంగా చూస్తారు.
  • పేరెంట్స్ గా కూడా కొన్ని పరిస్థితులలో నిశ్శబ్దం అవసరం.
  • ఆధ్యాత్మిక మార్గాలలో, అనేక మంది సాధకులు ప్రతిదీ నిశ్శబ్దంగా భరించాలి అని ప్రోత్సహించబడతారు. లేకపోతే సంఘం తప్పుపడుతుంది అని హెచ్చరికలు కూడా.

నిశ్శబ్దానికి లింగపరమైన పక్షపాతం కూడా ఉంది. లింగ అసమానత ఉన్న అనేక సమాజాల్లో మహిళలు పురుషుల కంటే ఎక్కువగా నిశ్శబ్దంగా ఉండాలని ఆపేక్షించబడతారు. మాట్లాడకూడదు, నవ్వకూడదు, నృత్యం చేయకూడదు, ప్రయాణం చేయకూడదు, నచ్చినట్టు ఉండకూడదు; తమ భావాలను వ్యక్తీకరించకూడదని వారికి చెబుతారు. వారు స్వరంలేని వారిగా నిశ్శబ్ధం లో జీవించాలి.

చక్రాన్ని పూర్తి చేయడానికి నిశ్శబ్దం బద్దలుగొట్టండి
నిశ్శబ్దం బద్దలుకొట్టండి

నిశ్శబ్దం హానికరమయ్యేప్పుడు

భావాలు మరియు శక్తిని నిరంతరం అణిచివేయడం వల్ల మన భావనాత్మక శక్తి వ్యవస్థల్లో అడ్డంకులు ఏర్పడతాయి. చక్రాలు నిలకడగా మూసుకుని ఉండిపోతాయి, మనస్సు మందగిస్తుంది, బలహీనత భావం పెరుగుతుంది. కూడగొట్టుకున్న కోపం ద్వేషం, క్షమాహీనత, పగలు మరియు ప్రతీకారం సైతం అనే ఆలోచనలు వస్తాయి. జీవితం భారంగా మారుతుంది, ముందుకు సాగడం కష్టమవుతుంది.

ఆధ్యాత్మిక పురోగతి మాత్రమే కాదు, వ్యక్తిగత అభివృద్ధి మొత్తం దెబ్బతింటుంది. ఆధ్యాత్మిక సాధనాలు తమ ప్రభావాన్ని కోల్పోతాయి. రంధ్రాలు ఉన్న పాత్రలో నీళ్లు నింపే ప్రయత్నంలా ఉంటుంది. సంవత్సరాలుగా మనిషి గొంగళి పురుగు మాదిరిగా ఉండిపోయి సీతాకోకచిలుకగా మారడం జరగదు. “నేను ఎవరికి హాని చేయను” అని భావిస్తూ తాము శాంతియుతమైన, సాధువులాంటి జీవితం గడుపుతున్నామని అనుకునే చాలామంది, నిశ్శబ్దం ద్వారా తాము తమకే హాని చేస్తున్నారని గ్రహించరు. ఇప్పుడు మీమ్మిలని మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది:

  • మీ నిశ్శబ్దం మీకు నిజంగా ఎంతవరకు ఉపయోగపడింది?
  • బయటకు చెప్పని భావాలు సృష్టించిన blocked చక్రాలను విచ్ఛిన్నం చేసి అభివృద్ధి చెందడానికి మీరు ఏమి చేయగలరు?

చక్రాలన్ని పూర్తి చేయండి

  • మీ ఆలోచనలు, భావాలు లేదా శక్తిని ఎక్కడ అణచి పెట్టారో గుర్తించండి.
  • మీరు ఎందుకు అలా చేస్తున్నారు అనే దానిని పరిశీలించండి. మీ నిశ్శబ్దం వల్ల ఎవరు లాభపడుతున్నారు? మీకు నిజంగా ఎంత ప్రయోజనం ఉంది?
  • మీ నమ్మక వ్యవస్థలో అడ్డంకులు ఎక్కడున్నాయో గుర్తించండి.
  • మీ మెదడు పొరలలో నిక్షిప్తమైన శక్తి అడ్డంకల్ని తెలుసుకోండి. ఏది మిమ్మల్ని మీలా ఉండనివ్వటంలేదో దాన్ని దైర్యంగా ఎదుర్కొండి.
  • ఆత్మగౌరవం కోల్పోకుండా, స్పష్టతతో, సులభతతో, ప్రేమతో పరిస్థితులను ఎలా తిరిగి రాయగలమో ఆలోచించండి.
  • ఇతరుల అంచనాల కంటే మీ జీవితం, మీ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి.
  • పాత చక్రాలను ముగించేందుకు అవసరమైన చోట నిశ్శబ్దాన్ని భంగం చేయండి.
  • ధైర్యంగా ఉండండి, మీ సహన స్థాయిలకన్నా మీ ఆత్మ అభివృద్ధిపై దృష్టి పెట్టండి.

మీ నిశ్శబ్దాన్ని బద్దలుగొట్టి, మిమ్మల్ని నిలిపివేసిన చక్రాలను పూర్తి చేసి కొత్త శక్తి, కొత్త డైమెన్షన్ లలోకి మరియు కొత్త అభివృద్ధి మార్గాల్లోకి మారేందుకు సిద్ధమవ్వండి.

విజయం కాంతిదే!

మాతో చేరడానికి: లైట్ వర్క్ ఇండియా WhatsApp చానల్: 🔗https://whatsapp.com/channel/0029Va63NlAGehEThlJaAc44
గాడెస్ పవర్ WhatsApp గ్రూప్: https://chat.whatsapp.com/DZKwfjvLQXeAlgtX6EPfRR

తెలుగు; ఇంగ్లిష్ & హింది భాషలలొ వెబ్సైట్: 🔗http://regret2revamp.com/

Jagruthi ఇంగ్లీష్ & హింది YouTube Channel 🔗https://youtube.com/@jagruthi
Crack the belief తెలుగు YouTube Channel 🔗 https://www.youtube.com/@CrackTheBelief

Blog: 🔗 http://crackthebelief.blogspot.com/?m=1

Contact mail id: http://regret2revamp@gmail.com
ఫేస్ బుక్ groups/pages:
https://m.facebook.com/regret2revamp/…
https://m.facebook.com/CrackTheBelief…https://m.facebook.com/groups/1063687…

టాకియాన్ చాంబర్ అపాయింట్మెంట్ కోసం ఈ ప్లే లిస్ట్ లో ఉన్న వీడియో లు చూడండి:
📽️https://www.youtube.com/playlist?list=PLsvD0UerbYdpT4GsnbRPGAOmUtZFo7BEo
టాకియాన్ హీలింగ్ సెషన్ అపాయింట్మెంట్ కోసం 📧http://regret2revamp@gmail.com కి మెయిల్ రాయండి.
లేదా 💬74113 33335 whatsapp కి మెసేజ్ చేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి