
1. మీరు మీలా ఉండండి అంటే ఏమిటి?
“మీరు మీలా ఉండండి” — ఈ వాక్యం మనం తరచుగా వింటాం, కానీ దాని అసలు అర్థం చాలా మందికి తెలియదు. మీ వ్యక్తిత్వం, గుర్తింపు, భావోద్వేగాల పొరల కింద ఉన్న నిజమైన “మీరు” ఎవరు? మీ అసలైన స్వభావం ఏమిటి, దానితో మీరు ఎలా కలుస్తారు?
అసెన్షన్ పోర్టల్ (Ascension Portal) ఓపెన్ అయినప్పటి నుంచి ఈ లోతైన ప్రశ్నలకు సమాధానాలు కనుగొనడం చాలా సులభమైంది. అయితే ఇక్కడ ఒకే ఒక సవాలు ఉంది — ఈ ప్రశ్నలను అడిగేంత అవగాహన కలగి ఉండడం. మీరు వెతకడం ప్రారంభించిన వెంటనే, విశ్వం స్పందిస్తుంది — అడగండి, మీకు ఇవ్వబడుతుంది.
2. సమాధానాలు మీలోనే ఉన్నాయి
ఇప్పుడు మీ గురించి మీకు ఎవరో చెప్పే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. సమాధానాలు ఇప్పుడు మీ అంతరంగం నుండే వస్తాయి. ఆత్మపరిశీలన, మనోనివేదనం (reflection), మరియు మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా మీరు మీ అంతర్ జ్ఞానాన్ని చేరుకోగలరు మరియు మీ ఆత్మ యొక్క తాత్విక స్వరూపాన్ని అర్థం చేసుకోగలరు.
మీకే మీరు అడగండి —
- నేను ఎవరు?
- నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను?
- నా ఆత్మ యొక్క ఉద్దేశ్యం ఏమిటి?
- నేను నా నిజమైన స్వరూపానికి అనుగుణంగా ఉన్నానా లేదా పరిస్థితులవల్ల మారిపోయానా?
కోపం, ప్రేమ, శాంతి, అసూయ వంటి భావాలు వచ్చినప్పుడు ఆగి ఆలోచించండి — ఇది నిజంగా “నేనా”? లేక కేవలం తాత్కాలిక అనుభవమా? కాలక్రమంలో, మీ అసలు స్వరూపాన్ని దాచిన ముఖవేషాలను అంటే మాస్క్ లను మీరు గుర్తిస్తారు. మరియు వాటిని వదలడానికి పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
3. ఆత్మ-అన్వేషణ యాత్రను స్వీకరించండి
మీ అసలు స్వభావాన్ని మీరు గుర్తించినప్పుడు, గతం యొక్క మాయాజాలాల వల్ల నిరుత్సాహపడవద్దు. ఈ మేల్కొలుపును హృదయపూర్వకంగా అంగీకరించండి. మీపై మీరు ప్రేమ చూపండి. మీమ్మల్ని మీరు క్షమించుకోండి. మీపై మీరు దయ చూపండి. ఇవి ఆధ్యాత్మిక పరిణామం (Spiritual Evolution) వైపు వేసే మొదటి అడుగులు. ఇలాంటి అడుగుల ద్వారానే ఎదుగుదల మొదలవుతుంది. ఈ మార్గంలో కొంత దూరం ప్రయాణించాక ఎంతో ఆనందం మొదలవుతుంది.
మీరు నిజంగా ఎవరో తెలుసుకున్న తరువాత, కాంతి మార్గంలో నడక మొదలుపెట్టండి. మీరు తెలుసుకుంటారు — మీ అసలైన స్వరూపం ప్రేమ అని. ఆ కాంతి బాటను మీకోసం కొనసాగించండి, అలాగే ఇతరులకూ వెలుగు చూపండి. మీరు ఇతరులకు దారి చూపినప్పుడు, మీరు ఒక కాంతివాహకుడు గా (Light Bearer) అవుతారు — అనుసరించేవారికి మార్గం సులభం చేసే మార్గదర్శకుడు గా మారుతారు. వీరినే way shower అంటారు.
4. అన్వేషణ కొనసాగించండి, అభివృద్ధి చెందుతూ ఉండండి
నేర్చుకోవడం మరియు బోధించడం సృష్టి యొక్క నిరంతర చక్రాలు. ఈ విధంగానే మనం అభివృద్ధి చెందుతాము మరియు మన అసలైన స్వరూపానికి తిరిగి చేరుకుంటాము. మీ లోపల నుండి సమాధానాలను వెతకడం ఎప్పటికీ ఆపకండి.
గమనించండి — ఇతరులు తమ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతున్నట్లయితే, మీరు కూడా ఇది సాధించగలరు. విశ్వం అందరికీ సమానంగానే స్పందిస్తుంది — తేడా కేవలం అడగాలనే అనే దానికి సిద్దంగా ఉన్నారా లేదా అనేదానిలోనే ఉంటుంది.
విజయం కాంతిదే
మాతో చేరడానికి: లైట్ వర్క్ ఇండియా WhatsApp చానల్: 🔗https://whatsapp.com/channel/0029Va63NlAGehEThlJaAc44
 గాడెస్ పవర్ WhatsApp గ్రూప్: https://chat.whatsapp.com/DZKwfjvLQXeAlgtX6EPfRR
తెలుగు; ఇంగ్లిష్ & హింది భాషలలొ వెబ్సైట్: 🔗http://regret2revamp.com/
Jagruthi ఇంగ్లీష్ & హింది YouTube Channel 🔗https://youtube.com/@jagruthi
 Crack the belief తెలుగు YouTube Channel 🔗 https://www.youtube.com/@CrackTheBelief
Blog: 🔗 http://crackthebelief.blogspot.com/?m=1
Contact mail id: regret2revamp@gmail.com
ఫేస్ బుక్ groups/pages:
http:// https://m.facebook.com/regret2revamp/…
http:// http:// https://m.facebook.com/CrackTheBelief…http:// http:// https://m.facebook.com/groups/1063687…
టాకియాన్ చాంబర్ అపాయింట్మెంట్ కోసం ఈ ప్లే లిస్ట్ లో ఉన్న వీడియో లు చూడండి:
 📽️https://www.youtube.com/playlist?list=PLsvD0UerbYdpT4GsnbRPGAOmUtZFo7BEo
 టాకియాన్ హీలింగ్ సెషన్ అపాయింట్మెంట్ కోసం 📧http://regret2revamp@gmail.com mail రాయండి
 లేదా 💬74113 33335 whatsapp కి మెసేజ్ చేయండి.

