భారతి

టీచర్, టింపనీ స్కూల్

శ్రీలక్ష్మి అనగానే గుర్తు వచ్చేది “మానిఫెస్ట్, విసువలైజ్, రిసీవ్”. ఆమె తో నా ప్రయాణం 10 సంవత్సరాలు. ధ్యానం ను జీవితానికి పరిచయము చేసి, దాని ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేది ఆమెని చూస్తే అర్ధం అవుతుంది. ఈ రోజు ఆమె ఉన్న స్థితి గురించి కొన్ని సంవత్సరాల క్రితమే చర్చించారు. క్రాప్ సర్కిల్స్, కాంతి ధ్యానం, చింతామణి, రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ మొదలైన పలు మార్గాలు ఆమె ద్వారా నాకు పరిచయం అయినాయి. ఎంతోమందిని ధ్యానమునకు పరిచయం చేసి వారు అనుకున్నవి సాధించే స్థితికి తీసుకుని వెళ్ళాడానికి ఇక్కడకి వచ్చిన డివైన్ సోల్ అనడంలో అతిశయోక్తి లేదు. నా పరిచయంలో, ఆవిడ ఎంతో మంది విద్యార్ధులు సన్మార్గంలో నడవడానికి దోహదపడడం చూసాను. యువత ఆమెని ఎంతో అభిమానిస్తారు. నిత్యం చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ, వీగన్ డైట్ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆవిడ అనుకున్నది సాధించి ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారు.

Dr. Monica

Student, Andhra Medical College, MD., Pathology

శ్రీలక్ష్మి గారి తో నా పరిచయం ఒక సంవత్సరం. నేను ఒక డాక్టర్ ని. ఆంధ్ర మెడికల్ కాలేజీ లో MD., పాథాలజీ చేస్తున్నాను. MD., ఎంట్రన్స్ పరీక్షా ప్రేపరషన్ సమయం లో చాలా స్ట్రెస్ ఉండేది. ఆ సమయం లో కాంతి ధ్యానంను నాకు పరిచయం చేశారు. వారి మెడిటేషన్ సెంటరులో రోజు పిరమిడ్ క్రింద కూర్చొని 20నిముషాల పాటు ధ్యానం చేశాను. దీని వలన అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ఆమె యొక్క కౌన్సిలింగ్ ఎఫెక్ట్ గురించి చెప్పాలంటే, నా ఫీల్డ్ లో చాలా స్ట్రెస్ ఉంటుంది. ఏదైనా సమస్య ఎదురు అయినప్పుడు ఆమె దగ్గరకి వెళ్లి మాట్లాడుతుంటే చాలా రిలీఫ్ వస్తుంది, బ్రెయిన్ కి సూథింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం ద్వారా కానీ లేదా మరి ఇంకా ఏదైనా పద్ధతి ఆచరించి సమస్య లోంచి బయట పడడం చెపుతారు. ఆమె దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఎలా ఉంటుంది అంటే చాలా అమేజింగ్ గా, సులువుగా ఆచరించే విధంగా ఉంటుంది. మన యొక్క బలమును, మెదడు యొక్క సామర్ధ్యంను గుర్తు చేస్తారు. ఏ రకమైన మోటివేషనల్ వీడియో లు చూడను. బ్రెయిన్ clumsy గా ఉన్నప్పుడు కూడా, ఇంక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె దగ్గరకి వెళతాను. నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నానా లేదా అనేది నాకు అర్ధం అవుతుంది. శ్రీలక్ష్మి గారు ఇచ్చే కాన్ఫిడెన్సు గాని, సపోర్ట్ గాని మాటలలో వర్ణించలేము. నా జీవితంలో ఎప్పుడు ఆమె సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాను. అందుకే ఆమెని చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను ఎవరికయినా.