దేవత రహస్యాలు పునరుద్ధరించడం

భగవంతుని సృష్టి పై మానవుల లో దయార్ధత వృద్ధి చెందాలి అంటే వారి లో ఉన్న దేవతా శక్తి ఉత్తేజితం అవ్వాలి. దీని కొరకు మానవులకి మద్దతు ఇవ్వడం అనేది నాకు గొప్ప ఆనందం కలిగిస్తుంది. ఈ పరివర్తన విశ్వం యొక్క మిగిలిన సృష్టితో అలైన్ అవడానికి మానవత్వానికి సహాయపడుతుంది.

ఈ జన్మలో గయా/భూమాత ని గాలక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ లో సభ్యురాలి గా చేయాలి అనే ప్రత్యేకమైన పనిలో ఉన్నాను.

About
దేవతా రహస్యాల పునరుద్ధరణ

వారం సందేశం

ఎమరాల్డ్ అగార్త ధ్యానం ప్రతి రోజు

కోబ్రా బొగోటా వర్క్‌షాప్ హాజరైన వారికి ఎమరాల్డ్ అగర్తా ధ్యానాన్ని పరిచయం చేసింది. ఈ ధ్యానం ఎమరాల్డ్ భౌతికంగా కలిగి ఉంది చేయడం ద్వారా ఎన్నో లాభాలు కలవు. ఇప్పుడు ఎమరాల్డ్ గ్రీన్ డోర్ రూపంలో యాక్టివేట్ అవుతోంది, దీని ద్వారా మీరు అగర్తాకి కనెక్ట్ అవ్వవచ్చు. కానీ కొలంబియాలో కనిపించేవి అత్యధిక వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ఎమరాల్డ్ అనేది అనేక విభిన్న విధులను కలిగి ఉన్న ఒక రాయి, మరియు వాటిలో కొన్ని మనం ఇప్పుడు ఉన్న కాలానికి మరియు గ్రహం యొక్క విముక్తికి కూడా చాలా ముఖ్యమైనవి. ఎమరాల్డ్ యొక్క మూడు ముఖ్యమైన విధులు ఇక్కడ ఉన్నాయి. ఎమరాల్డ్ యొక్క 3 ముఖ్యమైన విధులు క్రింది విధంగా ఉన్నాయి:

1. ఎమరాల్డ్ భూగర్భ రాజ్యం అగర్తాకు పోర్టల్‌గా పనిచేస్తుంది. ఎమరాల్డ్ ను పోర్టల్‌గా ఉపయోగించవచ్చు, దీని ద్వారా మీరు అగర్తా యొక్క శక్తిని యాక్సెస్ చేయవచ్చు – భూగర్భ రాజ్యం యొక్క శక్తి. కేవలం మీ మనస్సుతో లేదా ధ్యానం ద్వారా కనెక్ట్ కావడం కంటే ఎమరాల్డ్ ద్వారా అగర్తాకు కనెక్ట్ చేయడం చాలా శక్తివంతమైనది. ఎమరాల్డ్ ఎంత స్వచ్ఛంగా ఉంటే, కనెక్షన్ అంత శక్తివంతమైనది.

2. ఆకుపచ్చ రంగు హృదయ చక్రాన్ని తెరుస్తుంది. ఎమరాల్డ్ కూడా మనల్ని కోల్పోయిన హెవెన్కి కలుపుతుంది.

3.ఎమరాల్డ్ – దాచిన జ్ఞానాన్ని యాక్సెస్ చేయడానికి పోర్టల్‌గా ఉపయోగించవచ్చు. పచ్చల యొక్క మరొక అంశం ఏమిటంటే అవి సమృద్ధిని తెస్తాయి.

అందివ్వబడుతున్న కోర్సులు

బయాలజీ

విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు గొప్ప ఫెసిలిటేటర్. విభిన్న సంస్కృతుల విద్యార్థులకు భోధనలు అందించాను మరియు మానవ సంబంధాల నైపుణ్యాలలో గురించి పూర్తి అవగాహన ఉంది.

ఆధ్యాత్మికత

ఆధ్యాత్మికత, జీవితానికి సంపూర్ణతను ఇస్తుంది. ఇది మన చుట్టూ ఉన్న మాయను మరియు భ్రమలు తొలగిస్తుంది. మీ చుట్టూ ఏమి జరుగుతుందో సరైయిన విధానంలో చూడటానికి సహాయపడుతుంది.

కౌన్సెలింగ్

కౌన్సెలింగ్ మీ జీవితం లోని ఇబ్బందులను అధిగమించడానికి సహాయపడుతుంది. ధైర్యం, ఆత్మగౌరవం అభివృద్ధికి దారి తీస్తుంది. చివరగా మీరు ఎవరో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఐలాండ్ ఆఫ్ లైట్

ఐలాండ్ ఆఫ్ లైట్ భూమిపై అధునాతన నాగరిక ప్రదేశాలు, ఇక్కడ ఆత్మ కుటుంబాలు సామరస్యంగా, అనంతత్వం తో శాంతి మరియు షరతులు లేని ప్రేమతో నివసిస్తాయి.

నా అనుభవం

బయాలజీ టీచర్:
95%

టింపనీ స్కూల్ లో 2007 నుండి 2018 వరకు 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు [ICSE & ISC]

బోటనీ సీనియర్ లెక్చరర్
85%

శ్రీ చైతన్య మరియు వికాస్ జూనియర్ కాలేజీ లో, 2002 నుండి 2007 వరకు [ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డు మరియు CBSE]

పార్ట్ టైం బోటనీ లెక్చరర్
75%

AMAL కాలేజీ లో 1998 నుండి 2002 వరకు

బోటనీ మరియు హార్టికల్చర్ లెక్చరర్
80%

KAS డిగ్రీ కాలేజీ లో 1996 నుండి 1998 వరకు

Testimonials

భారతి

టీచర్, టింపనీ స్కూల్

శ్రీలక్షి అనగానే గుర్తు వచ్చేది “మానిఫెస్ట్, విసువలైజ్, రిసీవ్”. ఆమె తో నా ప్రయాణం 10 సంవత్సరాలు. ధ్యానం ను జీవితానికి పరిచయము చేసి, దాని ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేది ఆమెని చూస్తే అర్ధం అవుతుంది. ఈ రోజు ఆమె ఉన్న స్థితి గురించి కొన్ని సంవత్సరాల క్రితమే చర్చించారు.

క్రాప్ సర్కిల్స్, కాంతి ధ్యానం, చింతామణి, రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ మొదలైన పలు మార్గాలు ఆమె ద్వారా నాకు పరిచయం అయినాయి. ఎంతోమందిని ధ్యానమునకు పరిచయం చేసి వారు అనుకున్నవి సాధించే స్థితికి తీసుకుని వెళ్ళాడానికి ఇక్కడకి వచ్చిన డివైన్ సోల్ అనడంలో అతిశయోక్తి లేదు. నా పరిచయంలో,  ఆవిడ ఎంతో మంది విద్యార్ధులు సన్మార్గంలో నడవడానికి దోహదపడడం చూసాను. యువత ఆమెని ఎంతో అభిమానిస్తారు.

నిత్యం చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ, వీగన్ డైట్ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆవిడ అనుకున్నది సాధించి ఎంతో మందికి మార్గదర్శకులుగా నిలిచారు.

Dr. Monica,
Student, Andhra Medical College, MD., Pathology
శ్రీలక్ష్మి గారి తో నా పరిచయం ఒక సంవత్సరం. నేను ఒక డాక్టర్ ని. ఆంధ్ర మెడికల్ కాలేజీ లో MD., పాథాలజీ చేస్తున్నాను. MD., ఎంట్రన్స్ పరీక్షా ప్రేపరషన్ సమయం లో చాలా స్ట్రెస్ ఉండేది. ఆ సమయం లో కాంతి ధ్యానంను నాకు పరిచయం చేశారు. వారి మెడిటేషన్ సెంటరులో రోజు పిరమిడ్ క్రింద కూర్చొని 20నిముషాల పాటు ధ్యానం చేశాను. దీని వలన అద్భుతమైన లాభాలు ఉన్నాయి. ఆమె యొక్క కౌన్సిలింగ్ ఎఫెక్ట్ గురించి చెప్పాలంటే, నా ఫీల్డ్ లో చాలా స్ట్రెస్ ఉంటుంది. ఏదైనా సమస్య ఎదురు అయినప్పుడు ఆమె దగ్గరకి వెళ్లి మాట్లాడుతుంటే చాలా రిలీఫ్ వస్తుంది, బ్రెయిన్ కి సూథింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానం ద్వారా కానీ లేదా మరి ఇంకా ఏదైనా పద్ధతి ఆచరించి సమస్య లోంచి బయట పడడం చెపుతారు. ఆమె దగ్గర ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం ఎలా ఉంటుంది అంటే చాలా అమేజింగ్ గా, సులువుగా ఆచరించే విధంగా ఉంటుంది. మన యొక్క బలమును, మెదడు యొక్క సామర్ధ్యంను గుర్తు చేస్తారు. ఏ రకమైన మోటివేషనల్ వీడియో లు చూడను. బ్రెయిన్ clumsy గా ఉన్నప్పుడు కూడా, ఇంక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమె దగ్గరకి వెళతాను. నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నానా లేదా అనేది నాకు అర్ధం అవుతుంది. శ్రీలక్ష్మి గారు ఇచ్చే కాన్ఫిడెన్సు గాని, సపోర్ట్ గాని మాటలలో వర్ణించలేము. నా జీవితంలో ఎప్పుడు ఆమె సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నాను. అందుకే ఆమెని చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను ఎవరికయినా.