గయా కోసం బుద్ధిక్ కోలం

గయా అనేది భూమాత యొక్క వ్యక్తిత్వం మరియు గ్రీకు ఆదిమ దేవతలలో ఒకటి. బుద్ధిక్ కోలం [బిసి] అనగా శక్తి స్థాయిలో నిర్మించిన బుద్దిక్ అగ్ని యొక్క శాశ్వతంగా ఉండే కోలం. ఇది భూగ్రహ నెట్‌వర్క్‌కు అనుసంధానించబడి ఉంది. భూమి చుట్టూ ఉన్న మాయ పొర తొలగింపులో బుద్దిక్ కోలం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మరిన్ని వివరాల కోసం ఈ లింక్ ను సందర్శించండి.
http://2012portal.blogspot.com/2018/07/planetary-ascension-process.html

1996 యొక్క ఆర్కాన్ ల దాడి తరువాత, ఏంజెల్ క్ జీవులు మరల గ్రహం యొక్క ఉపరితలానికి దగ్గరగా ఉన్న ఆస్ట్రల్ మరియు ఈథరిక్ తలాలకు తిరిగి వస్తున్నారు. మీరు ఆ ఏంజెల్ క్ జీవులు అయిన దేవాల తో, ముఖ్యంగా బిసి ధ్యానంలో కనెక్ట్ కావచ్చు. దేవాలు సమయం, వాతావరణం, భూకంపాలు, హింసాత్మక తుఫానులు, విపత్తు ప్రభావాలు మొదలైన వాటిని నైపుణ్యంగా కంట్రోల్ చేస్తారు. మరిన్ని వివరాల కొరకు
http://www.earthtransitions.com/earth-healing/devas-magical-world/index.php
http://www.earthtransitions.com/earth-healing/earth-changes/index.php

బుద్ధిక్ కోలం ధ్యానం సమయంలో ధృడమైన శక్తి సుడిగుండం సృష్టించబడుతుంది. దీని కొన 5 కోణాలు కల నక్షత్రానికి కనెక్ట్ చేయబడింది. బుద్ధిక్ కోలం ని గయా పై ఏదైనా ప్రదేశం పైన లేదా పరిస్థితిలో లేదా ఒక వ్యక్తిపై ఏర్పరచవచ్చు.

గయా పై 5 పాయింటెడ్ స్టార్ నుండి వెలువడే కాంతి స్తంభాలతో BC.
Source: WLMM

ఇది ఎక్కడ నిర్మించబడినా, ఆ ప్రదేశాలలో ఋణాత్మకశక్తి యొక్క డెబ్రిస్ ను నలువైపుల నుండి పీల్చుకొని ధృడమైన శక్తి సుడిగుండంలోకి తీసుకువెళ్ళబడతాయి మరియు దాని కొన వద్ద ఉన్న 5 కొనలు గల నక్షత్రంలో కాల్చివేయబడతాయి. ఇవి స్థిరమైన నిర్మాణాలు మరియు శాశ్వత “క్లియరింగ్ స్టేషన్లు” గా ఉంటాయి. వాటి ఉద్దేశ్యం ఆస్ట్రల్ తలాలు క్లియర్ చేయడం. మరిన్ని వివరాల కోసం సందర్శించండి:
http://soul1.org/buddhiccol.htm

గయా కోసం బిసిని ఇప్పుడు నిర్మించడం ఎందుకు?

భూమాత చీకటి కాలం యొక్క చివరి దశ లో ఉంది. చాలా ఎక్కువగా లైట్ వర్కర్స్ పై భారీ దాడులు జరుగుతున్నాయి అని మీ అందరికీ తెలుసు. ఇవి చాలా రకాలు గా ఉత్పన్నం అవుతున్నాయి. ఇది మనల్ని మనం రక్షించుకోవడము మాత్రమే కాకుండా, మదర్ గయా ను కూడా రక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. తద్వారా మనందరి యుగాల తరబడి కంటున్న ద ఈవెంట్ అనే కలని నేరవేర్చుకుంటాం. కాబట్టి బిసి ధ్యానం దేవాల సహాయం తో చేసి గయాను శుభ్రపరచి, రక్షించాలి.

స్టార్ సీడ్స్ ముఖ్యంగా కాంతి ఏంకర్ చేస్తున్న మహిళలు భారీ దాడులకు గురవుతున్నారు. వారి పై శక్తి స్థాయి లో దాడి చేస్తున్న వారు  ఖైమెరా, ఆర్కన్స్, ప్లాస్మా స్పైడర్స్ మరియు బ్లాక్ మెజీషియన్స్ మొదలైనవారు., దేవత యొక్క అంసాత్మలు అయిన స్త్రీ ల యొక్క హృదయ చక్రమే ప్రధాన లక్ష్యం [ఐసిస్ అస్టారా మాదిరిగానే]. మనం ఈవెంట్‌కు దగ్గరవుతున్నప్పుడు, మాయ పొర సన్నగా మారుతుంది. చీకటి జీవులు ఇటువంటి దాడుల ద్వారా దాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ ధ్యానం గయాను శుభ్రపరచడంలో మరియు అక్కడ మాయ పొర పూర్తిగా తొలగించడానికి సహాయపడుతుంది. ఈ దాడుల గురించి మరిన్ని వివరాల కోసం:
https://fm144.blogspot.com/2019/11/situation-update-30112019_30.html

కాంతి కార్యకర్తలు గా మనం తీసుకోవాల్సిన చర్యలు:

  • గైడెడ్ ధ్యానం లో పాల్గొనడం
  • డిక్రీ చదవడం
గైడెడ్ ధ్యానం

డిక్రీ

నేను ఇప్పుడే ఆదేశిస్తూ; ఆజ్ఞాపిస్తున్నది ఏమనగా; మూలచైతన్యం యొక్క సంకల్పానుసారం; నా యొక్క I AM PRESENCE పేరు తో; నా యొక్క ఏతెరిక్ తలం; నా ఇల్లు; నా ఆఫీస్; నా యొక్క ఆర్ధిక తలాలు మరియు నేను ఎక్కడకు వెళ్ళినా నా పరిసర ప్రాంతాలు అన్ని పూర్తిగా కాస్మిక్ సెంట్రల్ రేస్; గాలక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ యొక్క సంరక్షణలో ఉంటూ; ఖైమెరా, బ్లాక్ మెజీషియన్లు, ఆర్కన్లు, ఎనర్జీ డాగర్లు, డీమన్లు, ప్లాస్మా సాలెపురుగులు, ఖైమెరా ఏర్పరచిన శక్తి కంచెలు యొక్క ప్రభావం పూర్తిగా తొలగింపబడాలి. ఈ జన్మలో కాని; గత జన్మలో కాని చీకటి జీవులేర్పరిచిన గాయాలన్నీ హీల్ అయ్యి; పూర్తిగా ఆ గాయాలు మూసివేయబడాలి. ఆర్క్ ఏంజెల్ మైకేల్; ఆర్క్ ఏంజెల్ రాఫెల్; పాజిటివ్ కాంతి మెజీషియన్ అయిన ఫ్రాంజ్ బార్దన్ ఈ నా యొక్క హీలింగ్ ప్రాసెస్ కి సహకరించి; అన్ని శక్తి తలాలలో ముఖ్యంగా ఏతెరిక్ తలం లో మూలచైతన్యం ఆదేశం ప్రకారం హీలింగ్ చేయాలని అభ్యర్దిస్తున్నాను. విజయం కాంతిదే. విజయం కాంతిదే. విజయం కాంతిదే.

ఓరియన్ స్టార్ గేట్ నుండి మదర్ గయా యొక్క ఉన్నత తలాలను శుభ్రపరచడం చాలా అవసరం. మీ అనుకూలమైన సమయంలో ఈ ధ్యానం ప్రతిరోజూ చేయండి.

విజయం కాంతిదే
విజయం దేవత దే

విజయం మదర్ గయా దే

1 comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి