లైట్ వర్కర్ / కాంతి కార్యకర్త

లైట్ వర్కర్ అంటే ఎవరు?

ఆధ్యాత్మిక సంఘాలలో చాలా ఎక్కువగా ఈ మాట వింటూ ఉంటాము.

అసలు దీని అర్ధం ఏమిటో చూద్దాం:

లైట్/కాంతి అంటే జీవం, ఇది సృష్టి యొక్క శక్తి ద్వారా మార్గనిర్దేశం చేయబడిన పునరుద్ధరణ శక్తి.

Light worker / లైట్ వర్కర్

ఈ కాంతిని పూర్తిగా తమకు మరియు ఇతరుల జీవితాలలోకి తీసుకురావడానికి తమ జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన వ్యక్తి నే లైట్ వర్కర్ అంటారు.

లైట్ వర్కర్ లక్షణాలు:

లైట్ వర్కర్ లు [LW] మూలం / పరమాత్మ పిలుపుకు అనుగుణంగా ఉంటారు. అధిక జ్ఞానం / సమాచారం వారి చైతన్యం ద్వారా లేదా సంకేతాల రూపంలో వస్తుంది. వారు భూమి మీద చదువుకోవడానికి, సంపాదించడానికి, వివాహం చేసుకోవడానికి లేరు అని గుర్తిస్తారు. వేరే పని చేయడానికి భూమిపై ఉన్నారు అని అంతర్ ప్రయాణం ద్వారా గుర్తిస్తారు. తెలుసుకోవాలి అనే ఆర్తి ఎల్లప్పుడూ శోధించడానికి, పని చేయడానికి మరియు వారి యొక్క జీవిత ప్రయోజనం గురించి మరింత తెలుసుకునేలా చేస్తుంది. తమ జీవిత ప్రయోజనంతో తమను తాము అలైన్తు చేసుకున్నప్పుడు, ఇతరులను హీల్ చేస్తారు, ఆశీర్వదిస్తారు మరియు చాలా మందికి మార్గనిర్దేశం చేస్తారు. ప్రతి పరిస్థితిని అందరకి సులభతరం చేస్తారు. అంతే కాకుండా కాంతి కార్యకర్తలు ఎక్కువ కాంతిని కలిగి ఉండి చాలా మందిని ఆకర్షిస్తారు.

లైట్ వర్కర్ ఎదుర్కొనే సవాళ్లు:

LW గా జీవితాన్ని రూపొందించుకునప్పుడు, అన్ని వైపుల నుండి చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. విమర్శలు, వ్యంగ్యం, రక్తకుటుంబీక సభ్యుల నుండి సహాయం లేకపోవడం మొదలైనవి. వీరు సమాజం యొక్క అంచనాలను అందుకోవాలి మరియు దానిపై ఆధారపడకూడదు అనే అపోహలు సంఘానికి ఉంటాయి. ఎందుకంటే సమాజం యొక్క అవగాహన ప్రకారం LW లకి అతీత శక్తులు ఉంటాయి. అందువలన మిగలిన ప్రజలు వారితో ఎలాగైనా ప్రవర్తించవచ్చు, కాని కాంతి కార్యకర్తలు మాత్రం కరుణతో ఉండాలి.

చీకటి నుండి సవాలు:

మరొక భిన్నమైన సవాలు చీకటి నుండి వస్తుంది. [ఈ గ్రహం మీద 2 రకాల శక్తులు ఉన్నాయి. కాంతి మరియు చీకటి. కాంతి మూలచైతన్యం నుండి వస్తుంది. ఇది హయ్యర్ వైబ్రేషన్ కలిగి ఉంటుంది మరియు ప్రేమతో నిండి ఉంటుంది. చీకటి ఎక్కువ సాంద్రత కలిగి, మానిప్యులేటివ్ గా ఉంటూ, తక్కువ వైబ్రేషన్ మరియు భయం ఆధారితమైనది]. ఈ సవాళ్లను అర్థం చేసుకోవడం మరియు పరిష్కరించడం అంత సులభం కాదు. చాలా ఉచ్చులు, మార్గంలో అవరోధాలు, తల పెట్టిన పనిని తేలికగా పూర్తి చేయలేరు, అపార్థాలు, ఆరోగ్య దాడులు, కుటుంబ సభ్యులపై దాడులు, ఆర్థిక సమస్యలు మరియు ఇలా వీటి జాబితా కొనసాగుతుంది. తోటి LW ల నుండి కొన్ని సార్లు సవాళ్లు కూడా ఉంటాయి. మాయపొర, ఇంప్లాంట్లు, ఆర్కన్లు మొదలైనవి దీనికి కారణం, చీకటి లైట్ పనిని కలుషితం చేయడానికి వీటిన్నటి ఉపయోగిస్తుంది. దారుణమైన దృశ్యం ఏమిటంటే చీకటి చేత క్రూరమైన దాడుల కారణంగా చాలా మంది కాంతి కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా ఎంతో కాంతి ని హోల్డ్ చేసి భూమాతని కాంతి మార్గం లో తీసుకుని వెళ్ళడానికి తమవంతు పాత్ర పోషిసిస్తూ ఉంటారు.

సామాన్యుడిగా కాకుండా LW గా జీవితాన్ని గడపడం నిజమైన సవాలు.

నువ్వు అంటే కాంతి

కాంతి యొక్క విజయం
లైట్ వర్కర్ యొక్క విజయం
భూమి యొక్క విజయం

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి