అంత్యకాలంలో గందరగోళం

ప్రపంచంలోని ప్రతి రంగంలో ప్రతిచోటా గందరగోళం. వ్యక్తిగత స్థాయిలో మరియు భూగ్రహ స్థాయిలో ఈ గందరగోళం పెరుగుతున్న ప్రపంచంలో వాస్తవానికి ఏమి జరుగుతోంది?

దేశాల మధ్య మరియు ఒక దేశంలో రాష్ట్రాల మధ్య కూడా విపరీతమైన వివాదాలు లేదా యుద్ధాలు జరుగుతున్నాయి. బాంబు పేలుళ్లు, అడవి మంటల పేరిట పట్టణాలలో మంటలు చెలరేగటం మొదలైనవి. కొందరు బయో ఆయుధాన్ని సృష్టిస్తారు. మరికొందరు టీకాలు సృష్టిస్తారు. అందరూ అన్ని రకాలుగా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. మరోవైపు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి కారణంగా ప్రజలలో చంచలత రోజురోజుకు పెరుగుతుంది.

ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితి:

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు జాగృతపరచబడడాన్ని గమనించవచ్చు. ప్రస్తుత ప్రపంచములో జరుగుతున్న విషయాల వలన కావచ్చు లేదా వారి వ్యక్తిగత విషయాల ద్వారా ఉత్పన్నమయ్యే భయం కారణంగా ప్రజలు ఆధ్యాత్మికతలోకి ప్రవేశిస్తున్నారు. ఆధ్యాత్మికతలో కొంతమంది సీనియర్లు ఈ వ్యక్తిగత మరియు భూగ్రహ పరిస్థితులను అర్ధం చేసుకోలేక సమతుల్యతలో ఉండలేకపోతున్నారు, మరియు వారు ఈ మార్గాన్ని వదిలివేస్తున్నారు. వారు తమ జీవిత ప్రణాళిక / సోల్ మిషన్‌ను విడిచిపెట్టారు. దీనివలన ఆధ్యాత్మికమార్గంలో నడుస్తున్న తోటి ప్రజలపై ఒత్తిడి పడుతున్నాది.

ఈ గందరగోళం ఎందుకు?

ఎవరు అంగీకరిస్తున్నారు లేదా అంగీకరించటం లేదు అనే దానితో సంబంధం లేదు. ఈ మార్పులు / సవాళ్లన్నీ 2020 లో వివిధ జ్యోతిషశాస్త్ర ఆకృతీకరణల వల్ల వచ్చాయి. దీనితో పాటు, మన మిల్కీవే గెలాక్సీ యొక్క సెంట్రల్ సన్ నుండి శక్తుల ప్రవాహం పెరిగింది. గ్రేట్ సెంట్రల్ సన్ నుండి ప్రవహించే శక్తులు ప్రతిదాన్ని ఆధ్యాత్మికతమార్గం వైపు మారుస్తాయి. ఈ మార్పులు / శక్తులను ఎక్కువ ప్రతిఘటిస్తే, అది మరింత అస్తవ్యస్తంగా ఉంటుంది. మరింత ఘర్షణ అభివృద్ధి చెందుతుంది మరియు ప్రజలు విసుగు చెందుతూ ఉంటారు.

ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి?

జీవితంలో ఎదురు అయ్యే సవాళ్లు మరియు ఈ వస్తున్నశక్తిప్రవాహన్ని అంగీకరించండి. మీరు ఇప్పటికీ ఆధ్యాత్మికతలో భాగం కాకపోతే ఇప్పుడే ప్రవేశించండి. ధ్యానం చేయడం దినచర్యగా చేసుకోండి. గ్రేట్ సెంట్రల్ సన్ నుండి ప్రవహించే శక్తులకు లొంగిపోండి. దృష్టి పెట్టండి. ప్రశాంతంగా ఉండండి. అవాంఛిత వార్తల నుండి మిమ్మల్ని మీరు డిస్‌కనెక్ట్ చేయండి. కలతపెట్టే మీడియాను ఆపివేయండి.

గందరగోళం విరిగిపోయిన TV

ఈ రోజుల్లో ఆధ్యాత్మిక restlessness పెరుగుతోంది. మీరే దీని సృష్టికర్త కాబట్టి మీరు దీని నుండి విముక్తి పొందవచ్చు. ఇతరులతో పోలచుకోవద్దు. comparison kills. గుర్తుంచుకోండి, మీ చర్యల వల్ల మీ ప్రకంపనలు తగ్గిపోతుంటే మీరు సర్వశక్తిమంతుడైన దేవునితో లేదా దైవిక ప్రవాహంతో అలైన్మెంట్ లో లేరని అర్థం. మీ ప్రకంపనలను తగ్గించేది ఏదైనా కానివ్వండి, దాని నుండి మిమ్మల్ని మీరు డిస్‌కనెక్ట్ చేయండి. మూలంతో మిమ్మల్ని మీరు సమలేఖనం/align చేసుకోండి. ఓపిక కలిగి ఉండండి. బయటివారి మాట కాకుండా మీ అంతర్గత మార్గదర్శకత్వం వినండి. కానీ అంతర్గత మార్గదర్శకత్వం మెదడు నుండి కాకుండా హృదయం నుండి రావాలని తెలుసుకోండి. అది మీకు అలాగే వస్తుందా లేదా అని నిర్ధారించుకోండి. మీ లక్ష్యం / జీవిత ప్రయోజనం / ఆత్మ మిషన్ పై దృష్టి పెట్టండి. మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారో ఎప్పటికీ మరచిపోకండి మరియు ఈ జీవిత దశ వరకు మిమ్మల్ని నడిపించినది అదే అని గుర్తు చేసుకోండి. Maintain the fire. మనము విజయం అంచున ఉన్నాము.

మీ ఆధ్యాత్మిక మార్గానికి మద్దతు ఇవ్వడానికి మీరు ఇంకా ఏమి చేయవచ్చు?

మన మిల్కీ వే గెలాక్సీ దేవత ప్లెరోమాకు కనెక్ట్ అవ్వండి. మరింత లవ్ మరియు లైట్ యాంకర్చేయండి. విజువలైజేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రేమ మరియు కాంతిని విస్తరించండి. ప్లెరోమా గురించి మరిన్ని వివరాల కోసం, సందర్శించండి:
http://2012portal.blogspot.com/2015/08/galactic-goddess.html

మీ హృదయకేంద్రీకృతమై ఉండండి. మిమ్మల్ని మీరు మానసికంగా సమతుల్యంగా ఉంచడానికి ప్లీడియాన్స్ ప్రోటోకాల్‌లను ఉపయోగించండి. గ్లోబల్ మాస్ ధ్యానాలలో పాల్గొనండి. విశ్వపు శక్తులు మీ ద్వారా ప్రవహించనివ్వండి. అసెన్షన్ ప్రక్రియతో గురించి పూర్తిగా తెలుసుకోండి. మీ మాట వినడానికి సిద్ధంగా ఉన్న ఇతరులకు అవగాహన కల్పించండి.

గందరగోళం నుండి మేల్కోండి

మీ ప్రతి చర్య 5d తో అలైన్మెంట్ లో ఉండాలి, తద్వారా 5d వాస్తవికత వేగంగా వ్యక్తీకరించబడుతుంది.

విజయం కాంతి దే

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి