భయము అనేది అవాంఛిత, వ్యాపించే భావోద్వేగం. మీకు ఆహారం తినిపించేటప్పుడు జీవితంలో మొట్ట మొదటిసారి తల్లిచే పరిచయం చేయబడుతుంది. ఒక జంతువునో లేదా పోలీసునో లేదా ఎవరో ఒకరిని చూపించి ఆమె శిశువును బెదిరిస్తుంది. ఆమె ఇది తెలియకుండానే చేస్తుంది.

బంధువులు, పాఠశాలలు, సమాజం, మీడియా [ఈ రోజుల్లో, ముఖ్యంగా కరోనావైరస్ విషయంలో, సిరియా తో యుద్ధం విషయంలో, ఇలా….] మొదలైనవి ప్రవేశపెట్టే వివిధ కారణాల వల్ల జీవితములో భయం కారకాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉదాహరణకి: https://prepareforchange.net/2020/02/19/benjamin-fulford-2-17-20-report-us-corporation-fails-to-meet-payments-date-and-threatens-to-poison-worlds-water-supply/

ఇది చాలా అడ్డంకులను ఏర్పరుస్తుంది. జీవితంలో ఎన్నో అవరోధాలని కల్పిస్తుంది. కొన్నిసార్లు ఇది నిరాశ లేదా ఫోబియా లకి దారితీయవచ్చు. వాస్తవికత యొక్క అవగాహన ప్రతికూలంగా ప్రభావితము చేయబడుతుంది. మానసిక మరియు శారీరక అనారోగ్యము వీటి ఫలితం. ఈ సమస్యలను పరిష్కరించడానికి, మానవులు ఇప్పటి వరకు నేర్చుకొన్న చాలా ప్రక్రియలను పూర్తిగా మరచి కొత్త విధానం నేర్చుకోవాల్సిన అవసరం వుంది.

ఈ భయము ఫలితం అత్యంత అసంతృప్తి, విసుగు చెందిన జీవితం. ఈ సమస్యలన్నిటి నుండి బయటపడటానికి, మొదటగా ఒక వ్యక్తి తనకు భయం ఉందని అంగీకరించాలి మరియు అర్థం చేసుకోవాలి. తరువాత అనేక స్థాయిలలో హీలింగ్ అవసరం.
స్త్రీలలో విభిన్నముగా లోతుగా పాతుకుపోయిన దృశ్యం:
స్త్రీల జీవితానికి చాలా రకాల భయకారకాలు చేర్చబడతాయి. పుట్టుకకు ముందే ఇవిఅన్నిమొదలవుతాయి [స్త్రీ భ్రూణహత్యతో] మరియు అనంతంగా ఉంటుంది. అనేక నియమాలు, ఆచారాలు మరియు నిబంధనలు ఆడవారిని అనేక విధాలుగా అడ్డుకోవటము లో చాలా కీలక పాత్ర పోషిస్తాయి.

భయము నుండి బయటకు రావడానికి పరిష్కారం:
ఈ భయాలన్నీ శరీరంలో జీవ శక్తి / శక్తి యొక్క ఫ్రీ గా ప్రవహించడాన్ని అడ్డుకుంటాయి. మనం మన యొక్క స్వంత భయానికి బాధితులం అవుతాము. దీని నుండి బయటకు రావడానికి చాలా పద్ధతులు ఉండవచ్చు. భయాన్ని విడుదల చేయడానికి శక్తివంతమైన ధ్యానము యొక్క ప్రోటోకాల్‌ను నేను మీతో పంచుకోబోతున్నాను. ఇది శరీరంలోని ఎనర్జీ బ్లాకులను విడుదల చేయడంలో సహాయపడుతుంది. మీ మార్గం స్పష్టంగా మరియు అడ్డంకులు లేకుండా ఉంటుంది. మీరు ఏ రకమైన పరిస్థితి నుండి బయటపడడానికి అయినా, మీకు అనిపించినట్టు, ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయవచ్చు.
గైడెడ్ ధ్యానపు ఆడియో
అందరూ భయము నుండి బయటకు రావాలని కోరుకుంటున్నాను. సంకోచించకుండా మీ ఫ్రీవిల్/సంకల్ప స్వేచ్చను వ్యక్తపరచండి. అన్ని స్థాయిలలో ఆనందాన్ని అనుభవించడానికి మిమ్మల్ని మీరు ఈ బ్లాక్ లనుంచి విముక్తి చేసుకోండి.

మానవుల భయరహిత స్థితి ద్వారా భూగ్రహ లిబరేషన్