కమ్యూనికేషన్ అనేది మాట్లాడటం, రాయడం, సంకేతాలు మరియు వివిధ మార్గాల ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసే పద్ధతి. సమాజంలో జీవించడానికి అవసరమైన అతి ముఖ్యమైన సాధనం ఇది. ఒక వ్యక్తి యొక్క విజయం అతను / ఆమె ఇతరులతో కమ్యూనికేట్ చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇది మాట్లాడటమే కాకుండా, ఇతరుల నుండి తగిన ప్రతిస్పందనను ఇచ్చే ఆలోచనలు లేదా భావాలను వినడం మరియు పంచుకోవడం కూడా కలిగి ఉంటుంది.
ప్రేమ భాష:
జీవిత భాగస్వాములలో కమ్యూనికేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పురుషుడి ప్రేమ భాష స్త్రీ ప్రేమ భాష కన్నా భిన్నంగా ఉంటుంది. కొందరు ఈ ప్రేమని బాడీ టచ్ గా, మరికొందరు మాటల రూపంలో వ్యక్తీకరిస్తారు. మానవులందరూ విభిన్నమైనవారు. ప్రేమ యొక్క కమ్యూనికేషన్ మార్గాలు విభిన్నంగా ఉంటాయి. ప్రేమతో నిండిన జీవితాన్ని పొందడానికి భాగస్వాములు వీలైనంత త్వరగా ఈ ప్రేమ భాషను అర్థం చేసుకోవాలి. దీనికి చాలా ఓపిక అవసరం.

కమ్యూనికేషన్ లోపం వలన పోరాటాలు:
ఒకరినొకరు సులువుగా అర్థం చేసుకోవడం ఎల్లప్పుడూ కష్టం. ఇలా ఎందుకు జరుగుతుంది? స్త్రీ మరియు పురుషుల శరీరాల చక్రాల వ్యవస్థలో తేడా ఉంది.
పురుషులలో శక్తి లోయర్ చక్రాలలో ప్రవహిస్తుంది. మహిళల్లో శక్తి హయ్యర్ చక్రాలలో ప్రవహిస్తుంది. చాలామంది మహిళలు తమ ప్రేమను ఎమోషన్స్ రూపంలో వ్యక్తం చేస్తారు. స్త్రీ యొక్క ప్రేమ భాష హృదయ కేంద్రీకృతమై ఉంటుంది, ఎందుకంటే వారి శక్తులు శరీరంలోని హయ్యర్ చక్రాలలో ప్రవహిస్తాయి, అనగా హృదయ చక్రం / అనాహత చక్రం మరియు అంతకంటే పైనున్న చక్రాలలో. మగ వారి శరీరంలోని దిగువ చక్రాలలో అంటే మూలాధార చక్రం నుండి మణిపూరక చక్రం వరకు మాత్రమే వారి శక్తులు ప్రవహిస్తున్నందున స్త్రీల కమ్యూనికేషన్ ను పురుషులు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు.
శక్తి ప్రవాహం వేర్వేరు దిశల్లో ఉంటుంది. స్త్రీ యొక్క హయ్యర్ చక్రాలు వ్యక్తీకరించే / కమ్యూనికేషన్ రీతిలో ఉంటాయి. మగవారి యొక్క లోయర్ చక్రాలు వ్యక్తీకరించే / కమ్యూనికేషన్ రీతిలో ఉంటాయి. కాబట్టి ఎల్లప్పుడూ స్త్రీ మరియు పురుషుల మధ్య ప్రేమ సంభాషణకు శక్తి అవరోధం ఉంటుంది. వారి మధ్య ఏ రకమైన కమ్యూనికేషన్‌లోనైనా ఇది ఇలాగే ఉంటుంది. అందువల్ల ఒక పురుషుడు స్త్రీ కంటే మెరుగైన రీతిలో మరొక పురుషుణ్ణి అర్థం చేసుకోగలడు. అలాగే స్త్రీ కూడా మరొక స్త్రీని మెరుగైన రీతిలో అర్ధం చేసుకుంటుంది పురుషుడి కన్నా. ఎందుకంటే అదే విధంగా వారి చక్రాలు శక్తిని వ్యక్తీకరిస్తాయి.
ఈ అడ్డంకిని తొలగించండి:
సమస్యకు కారణం మీకు తెలిసినప్పుడు, మీరు దాన్ని సరిగ్గా పరిష్కరించగలరు. దీన్ని అధిగమించడానికి సులభమైన పద్ధతి పురుషుడు మరియు స్త్రీలకి ఈ క్రింది విధంగా ఉంటుంది.
ఒక మగవాడు తన లోయర్ చక్రాల నుండి శక్తిని ఉన్నత చక్రాల వరకు ప్రవహించుటను ఊహించుకోవాలి. ఒక స్త్రీ హయ్యర్ చక్రాల నుండి లోయర్ చక్రాల వరకు శక్తి ప్రవహించుటను విజువలైజ్ చేయాలి. తద్వారా అన్ని చక్రాలు శక్తుల సమతుల్య ప్రవాహాన్ని చూపుతాయి.
మీకు మరియు మీ భాగస్వామికి ధ్యానం చేసే అలవాటు ఉంటే, అప్పుడు మీరు ఒకరికొకరు ఎదురుగా కూర్చుని, ఒకరి హృదయ చక్రాలపై మరికరు చేతులను ఉంచండి మరియు మీ చక్రాల మధ్య శక్తుల ప్రవాహాన్ని విసువలైజ్ చేయండి.
ప్రేమ యొక్క కమ్యూనికేషన్ పరిపూర్ణమైనది, నిజాయితీగా మరియు సంపూర్ణమవుతుంది.

ప్రేమ ని కమ్యూనికేట్ చేయుటలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను.
విజయం ప్రేమ మరియు కాంతి దే.