కాంతి కార్యకర్తల కోసం అప్డేటెడ్ ధ్యానాలు – 2020

ఇప్పటి నుండి కాంతి కార్యకర్తలు ఈ ధ్యానాలు అనుసరించాలని సూచించారు. అనేక జ్యోతిషశాస్త్ర అంశాల కారణంగా అధిక కంపనం లేనివి అన్ని పూర్తిగా రూపాంతరం చెందడం అనేది మనం 2020 లో చూస్తాం. ఈ సమయం ఎన్నో దశాబ్దాల తరువాత వచ్చిన అవకాశం. ఈ పరివర్తనలన్నింటినీ సామరస్యంతో మరియు శాంతితో స్వాగతించడానికి, ఈ సాధనాలను అనగా అప్డేటెడ్ ధ్యానాలు ఉపయోగిద్దాం.

ప్రాథమిక ఒప్పందాల తొలగింపు ప్రోటోకాల్/ప్రైమరీ కాంట్రాక్ట్ రిమూవల్ ప్రోటోకాల్:

మనం ఒక స్టార్ సీడ్ గా చాలా కాలం క్రితం ఈ మాయ ఆవరించిన/దిగ్బంధం కల భూమికి రావాలని నిర్ణయించుకున్నాము. మన నిర్ణయం ఫలితాలలో ప్రాథమిక ఒప్పందం ఒకటి. భూమిపై జన్మతీసుకోవాలనుకునే వారు ఎవరైనా చీకటి జీవులు రూపకల్పన చేసిన ఒప్పందాన్ని అంగీకరించి సంతకం చేయాలి. ఇది స్టార్ సీడ్ యొక్క చైతన్యంను పరిమితం చేస్తుంది మరియు వారి మెదడుని ప్రోగ్రామ్ చేస్తుంది. ప్రతి మానవుడు ఇక్కడ అవతరించడానికి ఈ ఒప్పందంపై సంతకం చేయాలి. ఆ ఒప్పందాన్ని మీ యొక్క ఎంపిక స్వేచ్చ తో తొలగించే క్షణం ఇదే. ఇది స్వేచ్ఛా సంకల్పం కల ప్రపంచం. ఈ ప్రాధమిక ఒప్పందాన్ని తొలగించడానికి మీ స్వేచ్ఛా సంకల్పం ఉపయోగించండి. మీరు ఒప్పందాన్ని రద్దు చేసినప్పుడు, చీకటి నియంత్రణలో ఉన్న అన్ని కార్యక్రమాలు తటస్థీకరించబడతాయి. మీ యొక్క ఎనర్జీ శరీరాల పై చీకటి జీవుల దాడులు ఆగిపోతాయి. మీ చైతన్యం విస్తరిస్తుంది. ప్రతిరోజూ ఈ ప్రోటోకాల్ బిగ్గరగా చెప్పండి. మీరు ఏసమయంలో నైనా చెప్పవచ్చు. ఇది చీకటి నియంత్రణను విడుదల చేస్తూ, బానిసత్వపు మార్గం నుండి విముక్తి కలిగిస్తుంది.

సెయింట్ జర్మైన్ వైలెట్ జ్వాల:

మీ జీవితంలోని అన్ని రంగాల్లో సహాయపడే ప్రత్యేక శక్తి. ఇది మీ శారీరక, మానసిక సమస్యలను హీల్ చేస్తుంది మరియు ఆధ్యాత్మిక జీవితాన్ని ఉద్ధరిస్తుంది. వైలెట్ రంగు ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంది. ఇది visible కాంతి యొక్క స్పెక్ట్రంలో అత్యధిక పౌనపున్యాన్ని కలిగి ఉంది. సెయింట్ జర్మైన్ యొక్క వైలెట్ జ్వాల కంపనాన్ని మారుస్తు ప్రతికూల శక్తిని రూపాంతరం చేస్తుంది. ఇది స్వీయ పరివర్తన కి అద్భుతమైన సాధనం. మీ పరిసరాలు, మదర్ గయా మొదలైనవాటిని శక్తి పరంగా శుభ్రపరచడానికి కూడా ఉపయోగించవచ్చు.

AN యొక్క వైట్ ఫైర్:

AN యొక్క వైట్ ఫైర్ క్రమరాహిత్యాలను కాల్చి/తీసి వేస్తుంది మరియు వాటిని కాంతిగా మారుస్తుంది. మానవ శరీరాల యొక్క కాంతి వాహకతను మెరుగుపరుస్తుంది. ఇది తక్కువ శక్తి స్థాయి శరీరాలను హయ్యర్ సెల్ఫ్ కోసం స్వచ్ఛమైన ప్రతీకలుగా మార్చి చివరికి దానితో విలీనం అయ్యే వరకు శుద్ధి చేస్తుంది. ఇదే అసెన్షన్ కు దారితీసే ప్రక్రియ. ఇది దైవిక సంకల్పం యొక్క కాంతి ప్రసారం చేయడానికి అనుమతిస్తుంది మరియు అన్ని వాస్తవికతలను పరమాత్మతో తిరిగి కనెక్ట్ చేస్తుంది. అంతటా పరమాత్మే సర్వశక్తిమంతుడు.

ప్లయిడియన్ మెడికల్ ప్రోటోకాల్:

ప్లయిడియన్లు మానవులకు దీర్ఘకాలిక నొప్పిని నయం చేయాలనుకుంటున్నారు. వారు నొప్పిని తగ్గించడానికి సహాయపడే ఒక ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేశారు. ప్లయిడియన్లు తమ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నొప్పిని తగ్గించడానికి కేంద్ర నాడీ వ్యవస్థను యాక్సెస్ చేస్తారు. ఈ కొత్త ప్రోటోకాల్ ఇంకా అభివృద్ధిలో ఉంది మరియు దాని సామర్థ్యంలో పరిమితం. దీర్ఘకాలిక నొప్పిని తొలగించే ఈ ప్రోటోకాల్ 80% ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది. అణచివేసిన అపరాధం, అణచివేసిన ప్రతికూల భావోద్వేగాలు, చీకటి శక్తులతో గత జీవిత ఆత్మ ఒప్పందాలు ప్రధానంగా తగ్గుతాయి.

చాలా సందర్భాలలో, ఈ ప్రోటోకాల్ నొప్పి యొక్క కారణాన్ని నయం చేయదు. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను సర్దుబాటు చేస్తుంది, తద్వారా ఇది నొప్పి సంకేతాన్ని తగ్గిస్తుంది. ఇంకా నొప్పి ఉండడం అనేది వైద్య సహాయం అవసరమని సూచిస్తుంది. ఈ ప్రోటోకాల్ సంప్రదాయ మరియు / లేదా ప్రత్యామ్నాయ ఔషధం ద్వారా వైద్య జోక్యానికి ప్రత్యామ్నాయం కాదు. మీకు నొప్పి ఉంటే, మీ ధ్యానాలు లో మీరు దీన్ని మీ మనస్సులో మూడుసార్లు ఇంగ్లీషులో లేదా మీ భాషలో పునరావృతం చేయవచ్చు.

కమాండ్ పిబి స్టార్ డస్ట్

కమాండ్ పిబి స్టార్ డస్ట్ ధ్యానాలు
ఇమేజ్ సోర్స్ WLMM బ్లాగ్

ఇంప్లాంట్ ప్రభావం తగ్గించే ప్రోటోకాల్:

ఇంప్లాంట్ అనేది ఎలక్ట్రాన్ యొక్క వ్యాసంతో సమానమైన వ్యాసంలో ప్లాస్మా బ్లాక్ హోల్. ఈథరిక్ మెదడు యొక్క ఫ్రంటల్ లోబ్‌లోని రెండు ఇంప్లాంట్లు స్వేచ్ఛా సంకల్పాని ఆచరించనివ్వవు. ఇది మూలచైతన్యంతో వ్యక్తిగత కనెక్షన్‌ను బ్లాక్ చేస్తుంది. మానవుడు తన దైవిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అనుమతించదు. ఈథరిక్ సోలార్ ప్లెక్సస్ పొర వద్ద మరొక ఇంప్లాంట్ భావోద్వేగాలను మరియు లైంగిక శక్తిని అణిచివేస్తుంది. మనస్సును ప్రత్యామ్నాయ స్థితుల్లో ఉంచడం ద్వారా మనస్సును నియంత్రించే ఇంప్లాంట్ల ప్రభావాన్నిసులభంగా తగ్గించవచ్చు. ప్రతిరోజూ ఈ కింది వాఖ్యాలని కనీసం 10 నిమిషాలు సేపు కాగితంపై వ్రాయవచ్చు లేదా మీ ధ్యాన సమయంలో ఈ ఆడియో వినవచ్చు.

I am God – I am not God

Sex is love – Sex is not love

https://youtu.be/KUU9zeVSyqw

ATVOR టెక్నాలజీ:

ఇది మన భూమి పై ఆకాశంలో ఉన్న మదర్ షిప్ ద్వారా ఉత్పత్తి చేయబడిన కాంతి యొక్క అధునాతన స్తంభాన్ని సృష్టిస్తుంది. మానవ శరీరంలోకి దిగుతు, తరువాత అగర్తా నెట్‌వర్క్ ద్వారా వెళుతుంది. ATVOR అధిక శక్తి కాంతి కణాలను సృష్టిస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న నవీకరించబడిన సాంకేతికత ఇది. మదర్‌షిప్‌లలోకి టెలిపోర్టేషన్‌ను సుగమం చేస్తుంది. మీ హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అవ్వడానికి లేదా మీ చుట్టూ రక్షణను ఏర్పాటు చేసుకోవడానికి కూడా మీరు ఈ విజువలైజేషన్‌ను ఉపయోగించవచ్చు.

ప్రధానమైన కాంతి ధ్యానాలు
అడ్వాన్స్ డ్ కాంతి ధ్యానాలు

వ్యక్తీకరణ సూత్రం:

దాని గురించి తెలుసుకోవడానికి, దయచేసి సందర్శించండి: http://regret2revamp.com/te/2019/07/26/వ్యక్తీకరణం-సూత్రం/

విజయం కాంతిదే:

  • మీకు అనిపించినప్పుడల్లా మీ మనసులో “విజయం కాంతిదే” అని అనుకుంటూ ఉండవచ్చు.
  •   ఎల్లప్పుడూ కాస్మిక్ సెంట్రల్ రేస్‌తో కనెక్ట్ అవ్వండి.
  •   సౌర వ్యవస్థ చుట్టూ, భూమి చుట్టూ మరియు మీ చుట్టూ, మీ యొక్క ధ్యానాలు లో ఫ్లవర్ ఆఫ్ లైఫ్ గ్రిడ్‌ను విజువలైజ్ చేయండి.
ఫ్లవర్ ఆఫ్ లైఫ్ ధ్యానాలు
ఇమేజ్ సోర్స్ WLMM బ్లాగ్

ఇప్పుడే సమృద్ధిని మానిఫెస్ట్ చేయండి
ఇప్పుడే లిబరేషన్‌ను మానిఫెస్ట్ చేయండి
ఇప్పుడే ఈవెంట్ ను మానిఫెస్ట్ చేయండి
దేవత యొక్క విజయం కాంతి యొక్క విజయానికి దారితీస్తుంది

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి