మతం అంటే ఏమిటి?
మతం అంటే చాలా నిర్వచనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి ‘మానవాతీత నియంత్రణ శక్తిపై నమ్మకం మరియు ఆరాధన, ముఖ్యంగా వ్యక్తిగత దేవుడు లేదా దేవుళ్ళు ఉండడం’. మనం తెలుసుకోవాలనుకోవడం లేనిది ఏమిటంటే దేవుడు మన జీవితాలను నియంత్రించడు. దేవుడు మనకు సంకల్ప స్వేచ్చ ఇచ్చాడు. మన ఆలోచనలతో మన జీవితాలను మనం నియంత్రిస్తాము.
http://www.huffingtonpost.com/entry/be-careful-of-your-though_b_5214689.html?section=india

ఈ మతంను ఎవరు సృష్టించారు?
భగవంతుడు సృష్టించలేదు. ఆయన మనిషిని సృష్టించాడు. మనిషి దీనిని సృష్టించాడు. దీని ద్వారా విభజించమని ఆయన మనకు చెబుతున్నారా? దానిపై పోరాడమని ఆయన మనలను అడుగుతున్నారా? ఏ మతం శాంతిని ఇస్తుంది అని మనుషులు కొట్టుకుంటున్నారు. అన్నిశాంతిని బోధిస్తే, మరి అవి శాంతిని ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి. సాధారణ జనాభా మతం అంటే నిజం అని నమ్ముతారు. తెలివి అయిన వారు అది తప్పు అని తెలుసుకుంటారు. పాలకులు దానిని తెలివిగా వాడుకుంటారు.



దేవుడు ఎవరు, మనం ఆయనను ఎలా చేరుకోవచ్చు?
దేవుడు సర్వవ్యాప్త చైతన్యం / శక్తి. విగ్రహం యొక్క సరిహద్దుల ద్వారా అతన్ని పరిమితం చేయలేరు. మీరు, నేను, మిగతావన్నీ దేవుడు. అతనికి మతం లేదు.

నేను ఈ విషయాలన్నీ మాట్లాడినప్పుడు మరియు విగ్రహారాధన చేయనప్పుడు, నేను దేవుని నమ్మను అని చాలా మంది అనుకుంటారు. నాకు, దేవుణ్ణి ఆరాధించడం, విగ్రహం ని ఆరాధించడాని కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రార్ధన పద్దతులు రకరకాలు. మనస్సు ద్వారా కాదు, హృదయం నుండి వచ్చే నిశ్శబ్ద స్వరం ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు. మీరు మనస్సును శాంతపరచాలి. మనస్సును శాంతపరిచే ఏకైక పద్దతి ధ్యానం. మెడిటేషన్ ద్వారా మాత్రమే దేవుణ్ణి చేరుకోవచ్చు.

మరియు నేను భగవంతుణ్ణి ప్రేమిస్తాను

మరియు నేను నమ్మేది, మీకు అతి సన్నిహితమైన సంబంధం భగవంతుని తో ఉండాలి.

దేవునితో మీ సంబంధాన్ని ఎలా పెంచుకోవాలి అనేది “ముందుగా మీరు దేవుడని తెలుసుకోండి”
మీకు పై దేవుని నుండి మరియుమీ లోపల ఉన్న దేవుడు నుండి ఆశీర్వాదాలు