టీచర్ / గురువు

గురువు అంటే హిందూ ఆధ్యాత్మిక గురువు.

జ్ఞానమార్గం ను చూపించేవాడు

“గురువు” యొక్క మూల అర్ధం చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్ళేవాడు. ఒకరి నిజమైన స్వభావాన్ని మేల్కొల్పగల సామర్థ్యం ఉన్నవాడు. ఒక గురువు అజ్ఞానం యొక్క చీకటిని తొలగిస్తాడు. టీచర్ / గురువు ఇతరులను తమలోనే ఉన్న సత్యాన్ని వెతకడానికి ప్రేరేపిస్తాడు. ఎల్లప్పుడూ మీరే మీ స్వంత గురువు మరియు ఉత్తమమైన గురువు, సమాధానాలు ఎల్లప్పుడూ మీలోనే ఉంటాయి. నిజమైన గురువును కనుగొన్నప్పుడు, మీరు సగం ప్రపంచాన్ని జయించినట్టే. నిజమైన గురువుతో ప్రయాణం సాటిలేనిది. గురువు మిమ్మల్ని కనిపించే పదార్ధం నుండి కనిపించని సత్యాల వైపుకి, భౌతిక పదార్ధం నుండి దైవత్వం వైపు, అశాశ్వతము నుండి శాశ్వతము వైపు, నిరుత్సాహము నుండి ఉత్సాహం వైపుకు ప్రోత్సాహిస్తాడు. టీచర్ / గురువు మన మార్గంలో మనమే నడిచే విధంగా మనకు మార్గనిర్దేశం చేస్తాడు. అతను ఎప్పుడూ వాడుకుని పీడించడం చేయడు, విమర్శించడు మరియు నిరుత్సాహపరచడు.

ఉన్నతమైన వృత్తి

నాకు అతను [గురువు] బాగా తెలిసిన కూడా, అతన్ని పూర్తిగా వర్ణించలేము. అతన్ని మాటల ద్వారా వ్యక్తపరచలేము. ఎవరి జీవితంలో నిజమైన గురువు ఉంటారో వారు అదృష్టవంతులు.

విద్యా దదాతి వినయం

ఈ జీవితంలో నన్ను అద్భుతమైన మార్గంలో నడిపిస్తున్న కనిపించే మరియు కనిపించని ఉపాధ్యాయులందరికీ చాలా కృతజ్ఞతలు. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి