స్నిప్పెట్# చింతామణి గ్రిడ్

ఈ స్నిప్పెట్ లు కోబ్రా యొక్క పాత ఇంటర్వ్యూ ల నిండి తీసుకున్నవి

స్నిప్పెట్ # 1

KP – కొంతమంది లైట్వర్కర్లు గ్రహం చుట్టూ చింతామణి రాళ్లను పాతిపెట్టడంలో పాలుపంచుకున్నారు, ఈ ప్రోజెక్ట్ తీసుకురావడంలో మీ ఉద్దేశం ఏమిటి? భూమి యొక్క ఉపరితలం క్రింద మరియు పై నుండి వస్తున్న కంప్రెషన్ చింతామణి గ్రిడ్ను మీరు ఇంతగా పెంచడానికి ఒక కారణమా?

కోబ్రా – అవును, వాస్తవానికి మనకు ఒక మధ్యవర్తి కావాలి, అక్కడ మనకు పై నుండి మరియు క్రింద నుండి వచ్చే ఆధ్యాత్మిక ఎలక్ట్రిసిటీ ను ప్రసారం చేయగల కాంతి బలగాలు ఉన్నాయి. మరి ఇది ఉపరితలం ఫ్రై [fry] చేయబడకుండా ఉండడానికి ఈ చింతామణి గ్రిడ్ కావాలి. ఆధ్యాత్మిక ఎలక్ట్రిసిటీ ఉపరితలం ద్వారా ప్రసారం కావాలి, అందుకే మనం చింతామణి రాళ్లను పాతిపెట్టాం. గెలాక్సీ వేవ్ సంభవించినప్పుడు, గ్రహం తాకినప్పుడు సురక్షితంగా ప్రసారం చేయడానికి. ఎందుకంటే ఇది గ్రహం తాకినప్పుడు, గెలాక్సీ వేవ్ లో ఒక భాగం గెలాక్సీ కేంద్రం నుండి, సౌర వ్యవస్థ ద్వారా వస్తుంది. సూర్యుడిని ఆక్టివేట్ చేస్తుంది, గ్రహం ను ఆక్టివేట్ చేస్తుంది . ఇప్పుడు జరుగుతున్న ఈ శుద్దీకరణ అంతా దీనికి సన్నాహాలు.

స్నిప్పెట్ # 2
స్నిప్పెట్  2
ఈవెంట్ ఫ్లాష్ – కుండలిని శక్తి

లిన్ – కోబ్రా; నేను నిన్ను సరిగ్గా కోట్ చేస్తుంటే “భూమి మధ్యలో ఉన్న శక్తి భూమి వెలుపల ఉన్న శక్తి తాకినప్పుడు కంప్రెషన్ బ్రేక్ త్రూ వస్తుంది” అని మీరు చెప్పారు. అంతరిక్షం నుండి వస్తున్న పెద్ద గెలాక్సీ సూపర్-వేవ్ గురించి మనం నిరంతరం వింటున్నాం కాని భూమి మధ్యలో నుండి ఏ శక్తి వస్తోంది?

కోబ్రా – భూమి మధ్యలో ఒక స్టార్‌గేట్ ఉంది మరియు ఈ స్టార్‌గేట్ గెలాక్సీ పల్స్ ద్వారా ప్రేరేపించబడుతుంది మరియు భూమి మధ్యలో ఉన్న ఆ స్టార్‌గేట్ యొక్క శక్తి ఉపరితలానికి చేరుకుంటుంది. కానీ కంప్రెషన్ బ్రేక్ త్రూ అంటే ఇది ఒక్కటే కాదు. దీని అర్థం ఉపరితలం క్రింద నుండి వచ్చే కాంతి శక్తులు ఉపరితలానికి చేరుకుంటాయి మరియు ఆకాశంలో ఉన్న మన నక్షత్ర మిత్రులు కొంతవరకు దిగి ఉపరితలానికి చేరుకుంటారు .

లిన్ – భూమి మధ్య నుండి వచ్చే శక్తి గెలాక్సీ సూపర్ వేవ్ నుండి భిన్నంగా ఉంటుందా?

కోబ్రా – ఒక విధంగా ఇది ఒక నిర్దిష్ట విధానం ద్వారా ఫిల్టర్ చేయబడిన గెలాక్సీ సూపర్-వేవ్ యొక్క శక్తి, ఎనర్జీ ఫిల్టర్ అయిన తరువాత భూగ్రహం అంతటా స్ప్రెడ్ చేయబడుతుంది.

రిచర్డ్ – వస్తున్న ఈ సూపర్ వేవ్‌తో మరియు భూకేంద్రం నుండి వస్తున్న ఎనర్జీ స్టార్‌గేట్‌తో శరీరం యొక్క కుండలినికి సంబంధం ఉందా?

కోబ్రా – అవును, సూపర్ వేవ్ రాక కుండలిని క్రియాశీలతను వేగవంతం చేస్తుంది.

స్నిప్పెట్ # 3
స్నిప్పెట్  3

కారి: కోబ్రా! మీరు మరియు రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ ప్రజలకు సేవ చేసే బ్యాంకింగ్ వ్యవస్థను మరియు మిలిటరీ ని ఎలా పునర్నిర్మించాలనే ప్రణాళికను కలిగి ఉన్నారా లేదా ఆ మార్పు ఎలా జరుగుతుంది?

కోబ్రా: అవును ఒక ప్రణాళిక ఉంది, నేను దాని గురించి చాలాసార్లు మాట్లాడాను. ప్రాథమికంగా ఖైమెరా సమూహాన్ని తొలగించి, కబాల్‌ను అరెస్టు చేసినప్పుడు, వాస్తవానికి ఈస్టర్న్అలయన్స్ కొత్త ఆర్థిక వ్యవస్థను సిద్ధం చేస్తోంది, ఇది కేవలం పరివర్తన ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఇది ఫస్ట్ కాంటాక్ట్ దశకి మారడానికి సహాయపడుతుంది.

  • ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందే, చాలా మందికి పాజిటివ్ ET తో పరిచయం ఏర్పడుతుంది.
  • వాస్తవానికి ఈ రకమైన పరిచయం ఇప్పటికే ప్రారంభమైంది. టెలిపతిక్ కమ్యూనికేషన్ యొక్క ఛానల్ స్థాపించబడింది.
  • ప్రతిదీ శుద్ధి చేయబడుతుంది. మూలచైతన్యం ఉనికిని ప్రజలు గుర్తు తెచ్చుకోవడం ప్రారంభిస్తారు.
  • ప్రతి ఒక్కరూ ఈవెంట్ యొక్క ఉత్ప్రేరకమే. అందరూ భూమికి వెలుగుని తెచ్చేవారే.
  • గెలాక్సీ సూపర్ వేవ్ మన సౌర వ్యవస్థ నుండి చీకటినంతటిని దుమ్ము దులిపి, గ్రహం యొక్క ఉపరితలం నుండి తొలగించేసి, మన సమాజాన్ని పూర్తిగా మారుస్తుంది.

గెలాక్సీ ఫెడరేషన్‌లోని కోపార్ట్‌నర్‌లలో భాగం కావడానికి ఆ మార్పు ద్వారా వెళ్ళడానికి మానవాళికి సహాయపడే అధునాతన సాంకేతికతలు మానవత్వానికి విడుదల చేయబడతాయి. సార్వభౌమ జాతిగా, గెలాక్సీ అంతటా ఇతర సార్వభౌమ జాతులతో కనెక్ట్ అవుతాము.

కారి: చాలా బాగుంది.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి